భారతదేశం, సెప్టెంబర్ 8 -- అమెరికాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితిపై ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అనలిటిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఉద్యోగ భవిష్యత్తు ఇప్పుడు ప్రధానంగా కేవలం రెండు రంగాలపైనే ఆధారపడి ఉందని, ఈ పరిస్థితి ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని మూడీస్ ముఖ్య ఆర్థికవేత్త మార్క్ జాండీ హెచ్చరించారు.

హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ.. ఈ రెండు రంగాలే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. ఈ రెండు రంగాలు లేకుంటే, అమెరికాలో కొత్త ఉద్యోగాల వృద్ధి దాదాపు సున్నాకు పడిపోయి ఉండేదని జాండీ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం, గత ఆరు నెలలుగా కేవలం సగం కంటే తక్కువ పరిశ్రమలు మాత్రమే కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఆర్థిక మాంద్యం సమయంలోనే కనిపిస్తుందని ఆయన అన్నారు.

మార్...