Hyderabad, ఏప్రిల్ 11 -- క్యాన్సర్ సోకిన వారికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఆపరేషన్ వంటివి అందిస్తారు. ఇవన్నీ అలోపతి కేటగిరీలోకి వస్తాయి. అంటే ఆంగ్ల వైద్య విధానంలోకి వస్తాయి. ఇవి క్యాన్సర్‌ను ససమర్థవంతంగా ఎదుర్కొంటాయని ఇప్పటికే నిరూపణ జరిగింది. ఆంగ్ల వైద్య విధానంతో పాటు కొంతమంది రోగులు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటారు.

ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అంటే... సంప్రదాయ వైద్య సంరక్షణ అని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ రోగులు కొంతమంది వివిధ కారణాలవల్ల ప్రత్యామ్నాయ చికిత్సల వైపు ఆసక్తి చూపిస్తారు. ఉదాహరణకు ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతి వైద్యం, చైనీస్ వైద్యం ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ చికిత్సల జాబితాలోకే వస్తాయి. వీటిని నమ్మి క్యాన్సర్ కు ఈ పద్ధతుల్లో చికిత్స తీసుకునే వారు కూడా ఉన్నారు.

ఈ వైద్య విధానంలో ఆహారంలో మార్పులు చేస్తారు. ...