భారతదేశం, మే 31 -- నైరుతి రుతుపవనాల ప్రభావంతో జమ్ముకశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు.. దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా జమ్ముకశ్మీర్​తో పాటు ఈశాన్య భారతంలో అనేక చోట్ల వరద పరిస్థితి నెలకొంది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రోడ్లు జలమయం అయ్యాయి.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అరుణాచల్ ప్రదేశ్​లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం తీవ్రంగా స్తంభించింది.

ఎగువ సుబన్సిరిలో, సిగిన్ నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రమైన దపోరిజోలో ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ప్రతికూల వాతావరణం కారణంగా జిల్లాలో 117 ఇళ్లతో పాటు పలు కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పోలో కాలనీ, సిగం రిజో, సిగిన్ కాలనీ, బుక్పెన్ కాలనీ, ఫారెస...