భారతదేశం, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం కొద్దిసేపటికే వాయిదా పడగా. ఇవాళ కీలక అంశాలపై చర్చ మొదలైంది. ముందుగా పంచాయతీ రాజ్, మున్సిపల్ సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. పలు సవరణలు సూచించారు.

ఇక ఇవాళ సభలో హోరీహోరీ పరిస్థితులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగనుంది. కమిషన్‌ నివేదిక సమగ్ర ప్రతిని ప్రవేశపెట్టిన తర్వాత.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించనున్నారు. కమిషన్‌ నివేదికపై ప్రభుత్వపరంగా తీసుకొనే చర్యలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ప్రభుత్...