భారతదేశం, ఆగస్టు 4 -- కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీల ప్రేవేశపెడతామని, దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగలడం జరిగిందని తెలిపారు. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కేసీఆర్‌కు నిపుణులు నివేదిక అందించారని, లక్ష క...