Hyderabad, జూన్ 24 -- మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తూ నిర్మిస్తున్న మూవీ కన్నప్ప. ఈ సినిమా ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు తనకు కన్నప్ప గురించి మొదట ఏమీ తెలియదని చెప్పడం గమనార్హం.

కన్నప్ప మూవీకి డైరెక్టర్ గా ఉన్నా కూడా ఇంతకుముందు తనకు ఆ శివుడి భక్తుడి గురించి ఏమీ తెలియదని డైరెక్టర్ ముకేశ్ చెప్పాడు. "లేదు, నాకు కన్నప్ప గురించి అస్సలు తెలియదు. నేను ఆంధ్రలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేసి చాలా సమాచారం సేకరించి విష్ణు వద్దకు తిరిగి వచ్చాను. అతను చాలా ఆకట్టుకున్నాడు. అలా ఈ ప్రాజెక్ట్ ఖరారైంది. నేను దర్శకుడిగా కన్ఫమ్ అయ్యాను" అని ముకేశ్ చెప్పాడు.

ఇక తాను కన్నప్ప గురించి తెలుసుకోవడానికి చాలానే రీసెర్చ్ చేసి...