Hyderabad, ఏప్రిల్ 27 -- కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. ఇందులో సూర్యకు జోడీగా హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో రూపుదిద్దుకుంది.

మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రెట్రో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రెట్రో చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా తాజాగా శనివారం (ఏప్రిల్ 26) సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.

రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ కథానాయకుడు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ముందుగా కాశ్మీర్ పహల్గామ్ బాధితులకు నివాళులు అర్పించిన విజయ్ దేవరకొండ హీరో...