Hyderabad, జూలై 25 -- శ్రావణ మాసం పూజల మాసం. ప్రతి నెలతో పోల్చుకుంటే, ఈ నెలలో ఎక్కువ పూజలు ఉంటాయి. హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం చాలా విశిష్టమైనది. తెలుగు నెలల్లో అయిదవ నెల. పౌర్ణమి తిధి నుంచి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకి శ్రావణమాసం అని పేరు. పైగా విష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కనుక, శ్రావణమాసం అని కూడా వచ్చిందని అంటారు.

శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈరోజే. లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో, ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వలన దీర్ఘ సుమంగళీ ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. శ్రావణమాసంలో శివకేశవలను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం తో పాటుగా, శ్రావణ శనివారం, శ్రావణ శుక్రవారం కూడా భక్తిశ్రద్ధలతో పూజ చేయడం మంచిది. అలా చేయడం వలన విశేష ఫలితాలను ...