Hyderabad, జూన్ 14 -- ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. జీవితంలో ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని చూస్తూ ఉంటారు. చాలామంది లైఫ్‌లో సంతోషం, శాంతి కలగాలని కష్టపడతారు. అయినా, కొన్ని కొన్ని సార్లు అడ్డంకుల వలన లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మనకు ఎదురయ్యే అడ్డంకాలను హిందూ సంప్రదాయాల్లో అష్టదరిద్రాలు అని అంటారు. ఆర్థిక, జ్ఞాన, సామాజిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, కర్మ, సంతోషం రంగాల్లో కష్టాలు వస్తాయి. ఎనిమిది దరిద్రాలు అశాంతి, అసంతృప్తిని కలిగిస్తాయి. జీవన నాణ్యత కూడా దెబ్బతీస్తాయి. ఈరోజు అష్ట దరిద్రాలంటే ఏంటి, దీని వలన ఎటువంటి ప్రభావం మన జీవితంలో పడుతుంది, వాటిని ఎలా అధిగమించాలి వంటి విషయాలని చూసేద్దాం.

జీవితంలో సవాళ్లు అష్టదరిద్రాల రూపంలో ఒక్కొక్కటిగా వచ్చినా, కలిపి వచ్చినా సరే, జీవితంలో సవాళ్లు అని ఎదుర్కోవాల్సి ఉ...