Hyderabad, సెప్టెంబర్ 7 -- టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ సినిమా'మిరాయ్‌'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు.

సెప్టెంబర్ 12న మిరాయ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో మిరాయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-ఏడేళ్ల క్రితమే ఈ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి ఇతిహాసాలని ఎలా ముడి పెట్టొచ్చనే ప్రాసెస్‌కి చాలా టైం పట్టింది. చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, పాషనేటింగ్ ఎలిమెంట్స్‌తో మిరాయ్‌ని డెవలప్ చేయడం జరిగింది.

-ఇది మన రూటేడ్ కథలా...