భారతదేశం, జనవరి 2 -- కొత్త ఏడాది వేళ వెండితెరపై మరో ప్రేమకథ పట్టాలెక్కింది. బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కీర్తి కుల్హారి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' (Four More Shots Please!) సహనటుడు రాజీవ్ సిద్ధార్థతో ప్రేమలో ఉన్నట్లు కీర్తి తాజాగా అధికారికంగా ప్రకటించారు.

శుక్రవారం (జనవరి 2) నాడు కీర్తి కుల్హారి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రత్యేకమైన రీల్‌ను షేర్ చేశారు. అందులో రాజీవ్‌తో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కారులో తీసుకున్న సెల్ఫీలు, కలిసి చేసిన ప్రయాణాలు, లిఫ్టులో దిగిన క్యూట్ ఫోటోలతో పాటు.. రాజీవ్ నుదుటిపై ఆమె ముద్దు పెడుతున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో చివరలో కిటికీపై బాణం గుర్తుతో ఉన్న హా...