భారతదేశం, మే 22 -- వినీతి కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనతోపాటుగా మరో ఐదుగురి పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొ్న్నారు. సత్యపాల్ మాలిక్ జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో కిరూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కేసులో జరిగిన అవినీతికి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఆ తర్వాత సత్యపాల్ మాలిక్ పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

సీబీఐ అధికారికంగా చార్జిషీట్ దాఖలు చేయగా మాలిక్ ఆసుపత్రిలో చేరానని, పరిస్థితి చాలా విషమంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను మాలిక్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'శ్రేయోభిలాషుల నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. వాటికి నేను సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ప్రస్తుతం నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని, ఎవరితోనూ మాట్లాడే స్...