భారతదేశం, మే 15 -- ఏపీలో కడప మేయర్‌తో పాటు మాచర్ల మునిసిపల్ ఛైర్మన్‌ పై అవినీతి ఆరోపణలతో వేటు పడింది. కడప మేయర్‌పై వివరణ కోరిన 24 గంటల్లోనే పదవి నుంచి తప్పిస్తూ మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి వ్యవహారాలపై మేయర్‌ వివరణ కోరుతూ పురపాలక శాఖ కార్యదర్శి వివరణ కోరారు. మేయర్‌ విచారణకు హజరైన 24 గంటల్లోనే పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కడప మేయర్ సురేష్‌బాబును మేయర్‌ పదవి నుంచి తప్పిస్తూ ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్‌ బాబు తన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలతో కార్పొరేషన్‌ నిధులను కట్టబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు కడప కార్పొరేషన్‌లో పట్టు కోసం టీడీపీ-వ...