భారతదేశం, మే 14 -- లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీకి పట్టుబడిన పోలీసు అధికారిపై అక్రమంగా బుల్లెట్లు ఉన్నాయనే అభియోగంపై మరో కేసు నమోదైంది.

ఏసీబీ అరెస్ట్ చేసిన సూర్యాపేట డిఎస్పీ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ జరిపిన సోదాల్లో 21 బుల్లెట్లు, 69 ఖాళీ బుల్లెట్‌ షెల్స్ లభించాయి. దీంతో ఏసీబీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సూర్యాపేట పట్టణంలో నకిలీ డాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్లను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

ఫిర్యాదుదారుడి నుంచి తొలుత రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో సూర్యాపేట సబ్ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్, సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌లను అరెస్టు చేశామని, ఫిర్యాది అభ్యర్థన మేరకు రూ.16 లక్షలకు దానిని కుదించారని ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

నిందితుడిని అరెస్టు చేయకుండా...