భారతదేశం, ఆగస్టు 4 -- భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. భారత్‌పై సుంకాన్ని గణనీయంగా పెంచుతామని ట్రంప్ సోమవారం తాజా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధించడం, రష్యా చమురు, ఉత్పత్తుల కొనుగోళ్ల దృష్ట్యా భారత్ కు 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ఇటీవలే ప్రకటించారు.

తాజాగా రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తుందని ట్రంప్ ఆరోపణలు చేశారు. భారత్‌ ఎక్కువ మెుత్తంలో చమురు కొనుగోలు చేయడం వలన రష్యాకు లాభాలు వస్తున్నాయన్నారు. అందుకోసమే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదన్నారు.

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణను నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల మధ్య ట్రూత్ సోషల్‌లో తాజా సందేశం వచ్చింది. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలను...