భారతదేశం, నవంబర్ 21 -- నటి, నిర్మాత సమంత రూత్ ప్రభు తన ఫిట్‌నెస్ ప్రయాణంలో క్రమశిక్షణ, అంకితభావం ప్రధానమని మరోసారి నిరూపిస్తోంది. ఇంటెన్స్ వర్కౌట్‌లు, తన సూపర్ ఫిగర్ మెయింటేన్ చేస్తుందన్న పేరు తెచ్చుకున్న సమంత శుక్రవారం (నవంబర్ 21) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. బలమైన బ్యాక్ తనకు ఎప్పటికీ ఉండదని తాను నమ్మినా.. కఠినమైన శిక్షణ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆమె చెప్పింది. అయితే ఈ పోస్టుపై "చాలా సన్నగా కనిపిస్తున్నారు" అని వ్యాఖ్యానించిన ఒక ట్రోల్‌కు సమంత ఘాటుగా సమాధానం ఇచ్చింది.

తాను కష్టపడి సాధించిన బ్యాక్ మజిల్స్ ను చూపిస్తూ ఒక ఫోటోను పంచుకున్న సమంత ఇలా క్యాప్షన్ ఇచ్చింది. "కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఎప్పటికీ బలమైన బ్యాక్ రాదనే నిర్ణయానికి వచ్చేసాను. అది నా జీన్స్‌లో లేదని నిజంగా అనుకునేదాన్ని. వేరే వాళ్లకు మ...