భారతదేశం, జనవరి 23 -- సమాజంలో మనుషుల మధ్య పరస్పర గౌరవం అనేది అత్యంత కీలకం. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని సందర్భాల్లో ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, అవమానించడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తిని మాటలతో గాయపరచడం అనేది శారీరక గాయం కంటే లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ గాయాలు పైకి కనిపించవు కానీ, మనసును లోలోపల దహించివేస్తాయి.

అవమానం అనేది కేవలం ఒక చేదు అనుభవం మాత్రమే కాదు, అది మన మెదడుపై, ఆలోచనా తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

"పదే పదే అవమానాలకు గురయ్యే వ్యక్తులు తమపై తాము నమ్మకాన్ని కోల్పోతారు. 'నేను దేనికీ పనికిరాను' అనే భావన వారిలో బలంగా నాటుకుపోతుంది. ఇది దీర్ఘకాలంలో యాంగ్జైటీకి, మానసిక కుంగుబాటుకు (Depression) దారితీస్తుంది" అని సైకాలజిస్ట్ శీతల్ దేవరకొండ వివరించారు.

అవమానాలను భరిస్తూ కూర్చోవడం కంటే, వాటిని తెలివిగా ఎదుర్కోవడం వల్ల...