భారతదేశం, ఆగస్టు 19 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార తెలుసు కదా. ఇన్‌స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే అత్యంత కొద్ది మంది సెలబ్రిటీల వారసుల్లో ఆమె కూడా ఒకరు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా తన పేరిట పుట్టుకొస్తున్న నకిలీ అకౌంట్ల గురించి మంగళవారం (ఆగస్టు 19) ఆమె ఓ పోస్ట్ చేసింది.

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఫేక్ అకౌంట్ల గురించి చెబుతున్న పోస్ట్ అది. అందులో సితార ఏం రాసిందంటే.. "ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. నా పేరుతో ఎన్నో ఫేక్, స్పామ్ అకౌంట్లు పుట్టుకొచ్చాయని నా దృష్టికి వచ్చింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే..

నేను ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటాను. నా అఫీషియల్ అకౌంట్ ఇదొక్కటే. ఇదొక్క మీడియం నుంచే ...