భారతదేశం, జనవరి 1 -- టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ హీరోగా కెరీర్ నిర్మించుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జా కెరీర్ స్టార్టింగ్ లోనే 'హనుమాన్' లాంటి సినిమాతో ఓ బూస్టప్ దొరికింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాతో తేజ కెరీర్ వేగాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ సీక్వెల్ 'జై హనుమాన్' సీక్వెల్ నుంచి తేజ తప్పుకొన్నాడనే వార్తలొచ్చాయి. దీనిపై ఈ హీరో రియాక్టయ్యాడు.

హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్ నుంచి తాను తప్పుకొన్నానని వస్తున్న వార్తలపై తేజ సజ్జా స్పందించాడు. ఈ విషయంపై హిందూస్థాన్ టైమ్స్ అతణ్ని సంప్రదించగా.. ''అవన్నీ తప్పుడు వార్తలు'' అని కొట్టిపడేశాడు తేజ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి దూరం అయ్యే సమస్యే లేదని తేల్చి చెప్పాడు. హన...