భారతదేశం, డిసెంబర్ 18 -- ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అవతార్ 3. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఇండియాలో డిసెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. కానీ, విదేశాల్లో ఈపాటికే అవతార్ 3 ప్రీమియర్ షోలు పడ్డాయి.

అవతార్ వంటి బ్లాక్ బస్టర్ సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కొందరు విమర్శకులు ఈ సినిమాను 'బోరింగ్' అని, ఇందులో విషయం లేదని కొట్టిపారేస్తుంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇది ఒక సరికొత్త అనుభూతి, విజువల్ వండర్ అంటూ పండగ చేసుకుంటున్నారు.

ఇలా ఎన్నో అంచనాలతో రిలీజ్ అవనున్న అవతార్ 3పై షాకింగ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ఆడియెన్స్ ఈ సిన...