Hyderabad, సెప్టెంబర్ 26 -- హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇక అవతార్ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా ప్రశంసలు పొందడమే కాకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మొదట 2009లో రిలీజ్ అయిన అవతార్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.

అవతార్ సినిమా తర్వాత 13 ఏళ్లకు రెండో పార్ట్‌గా "అవతార్: ది వే ఆఫ్ వాటర్" సినిమా వచ్చి అంతకిమించిన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టింది. 2022లో వచ్చిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ అవతార్ ఫ్రాంఛైజీ నుంచి మరో సినిమా మూడో పార్ట్ రానుంది.

అదే అవతార్ 3. అవతార్ సిరీస్‌లో మూడో పార్ట్‌గా వస్తోన్న సినిమాకు అవతార్ ఫైర్ అండ్ యాష్ అని టైటిల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 25న రాత్రి...