భారతదేశం, డిసెంబర్ 12 -- అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబుతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ప్రకటించారు.

"అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జరిగిన యాత్రికుల ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ప్రమాదంపై అధికారులతో మాట్లాడాను, బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నాను. క్...