భారతదేశం, డిసెంబర్ 12 -- ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి -చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా. 20 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమన్నారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది ప...