భారతదేశం, ఏప్రిల్ 29 -- అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఎదురుకాల్పులు జరిగాయి. కాకులమామిడి, కాంటవరం దగ్గర.. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టుల కోసం జల్లెడ బలగాలు పడుతున్నాయి. కాల్పులు జరిగిన దగ్గర ఎస్ఎల్‌ఆర్ మ్యాగ్జిన్, కమ్యూనికేషన్‌ పరికరాలు, విప్లవ సాహిత్యం, యూనిఫామ్, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో కొండలు, అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో వారి కార్యకలాపాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలు (ఏవోబీ) అని కూడా అంటారు. ఈ ప్రాంతాలు దట్టమైన అటవీ భూభాగం కలిగి ఉండటం వల్ల మావోయిస్టులకు అనుకూలంగా...