భారతదేశం, డిసెంబర్ 12 -- అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది! చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు.

లోయలో పడిన బస్సు నంబరు AP39 UM6543. అరకు నుంచి భద్రాచలం వెళుతుండగా రాజు గారి మెట్టు మలువు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో 30కిపైగా మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. బస్సు లోయలో పడిన వెంటనే ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అనేక మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నించారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ...