Andhrapradesh, జూన్ 18 -- అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.

ఈ ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ తో పాటు మరో మావోయిస్టు అగ్రనేత రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ, మరో మావోయిస్టు నేత కూడా హతమయ్యారు.

అరుణ భర్త అయిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియస్ చలపతి ఒడిశా సరిహద్దులో ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య అయిన చైతన్య అలియాస్ అరుణ. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు.

ఇక గాజర్ల రవి ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉండగా, అరుణ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు ...