Hyderabad, అక్టోబర్ 1 -- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, నటుడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుధవారం (అక్టోబర్ 1)నాడు అతడు తన నిశ్చితార్థం గురించి వెల్లడించాడు. నయనిక అనే అమ్మాయితో తన నిశ్చితార్థం జరగనున్నట్లు చెప్పాడు. తన తాత, లెజెండరీ నటుడు, కమెడియన్ అల్లు రామలింగయ్య జయంతి రోజునే తాను ఈ అనౌన్స్‌మెంట్ చేస్తున్నట్లు శిరీష్ తెలిపాడు.

అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ అనౌన్స్‌మెంట్ ను తన ప్రేయసితో కలిసి ఉన్న ఫొటో ద్వారా షేర్ చేశాడు. అల్లు శిరీష్ పారిస్‌లో ఉన్నప్పుడు నయనిక చేయి పట్టుకున్న ఒక ఫోటోను ఇందులో చూడొచ్చు. దూరం నుంచి ఐఫిల్ టవర్ కనిపిస్తోంది. ఆ నోట్‌లో అతడు ఇలా రాశాడు. "ఈ రోజు మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా మనసుకు చాలా దగ్గరైన విషయం.. అది నయనికతో అక్టోబర్ 31న నా నిశ్చితార్థం. ఈ వార్త పంచుకోవడం నాక...