Hyderabad, ఆగస్టు 30 -- అల్లు అర్జున్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కీర్తిశేషులు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్న నానమ్మ అల్లు కనకరత్నం కన్నుమూశారు. 94 సంవత్సరాల వయసున్న అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం (ఆగస్ట్ 29) అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో అల్లు కనకరత్నం మరణించారు. దీంతో అల్లు అర్జున్ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక నానమ్మ మరణ వార్త తెలియగానే ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హైదరాబాద్‌కు బయలుదేరాడు.

అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మైసూరు నుంచి హుటాహటిన హైదరాబాద్‌కు బయలుదేరాడు. అల్లు కనకరత్నం అంత్యక్రియలను ఇవాళ (ఆగస్ట్ 30)మధ్యాహ్నాం అనంతరం కోకాపేటలో నిర్వహించనున్నారు. మరికాసేపట్లో అల్లు కనకరత్నం పార్థివదేహ...