భారతదేశం, ఫిబ్రవరి 17 -- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదంలో మరో మలుపు. అల్లు అర్జున్ ను కలవడానికి ముందు అతని టీమ్ తనకు 42 'డూస్ అండ్ డోంట్స్' (చేయవలసినవి, చేయకూడనివి) జాబితాను ఇచ్చిందని రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో బ్రాండ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా పేర్కొంది. ఈ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి.

అల్లు అర్జున్ 42 రూల్స్ కాంట్రవర్సీలో ఇప్పటికే ఇలాంటి లిస్ట్ ఏం లేదని హీరో సంబంధిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావేరి బరువా పబ్లిక్ గా సారీ చెప్పింది. సోషల్ మీడియాలో పోస్టులో క్షమాపణాలు కోరింది. ఈ కామెంట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అల్లు అర్జున్ బృందం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇప్పుడు బ్రాండ్ స్ట్రాటజిస్ట్, పాడ్‌కాస్టర్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

కావేరి బరువా తన ఎక్స్ అకౌంట్లో క్షమాపణ...