భారతదేశం, సెప్టెంబర్ 7 -- పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్. ఈ రెండు చిత్రాలతో అల్లు అర్జున్ వేరే రేంజ్ కు వెళ్లిపోయారు. ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పుష్ప 3 ఎప్పుడు? అసలు ఉంటుందా? అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సస్పెన్స్ కు సుకుమార్ తెరదించారు. పుష్ప 3 ఉంటుందని కన్ఫామ్ చేశారు.

దుబాయ్ లో జరిగిన సైమాలో పుష్ప 2: ది రూల్ సినిమాకు గాను మూవీ టీం ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని హాజరయ్యారు. అవార్డులను గెలుచుకున్న తరువాత సుకుమార్ ఈ చిత్రం మూడవ భాగం పుష్ప 3: ది ర్యాంపేజ్ ను ఖచ్చితంగా రూపొందిస్తామని ధృవీ...