Hyderabad, జూలై 6 -- టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమా జులై 4న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే తమ్ముడు సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, తమ్ముడు రిలీజ్‌కు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

హీరో నితిన్‌ను అల్లు అర్జున్ రేంజ్‌కు వెళ్లలేకపోయావని తాను చెప్పినట్లుగా ఆ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ కామెంట్స్ తమ్ముడు రిలీజ్ సమయంలో వైరల్ అయ్యాయి.

"నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్, బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడ...