Hyderabad, ఆగస్టు 4 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుష్ప సాంగ్ పై చేసిన పర్ఫార్మెన్స్ గా భావిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ 'బి యూనిక్ క్రూ' అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20లో 'పుష్ప' సినిమాలోని పాటకు డ్యాన్స్ చేసినట్లుగా ఒక ఫేక్ వీడియో వైరల్ అయింది. దీనిని నిజమేనని అల్లు అర్జున్, 'పుష్ప' టీమ్ నమ్మింది. ఈ వీడియో నిజానికి నకిలీది. ఆ డ్యాన్స్ గ్రూప్ పూర్తిగా వేరే పాటకు పర్ఫామ్ చేసింది. అసలు ఏం జరిగిందో చూడండి.

'పుష్ప' సినిమా సోషల్ మీడియా హ్యాండిల్, ఆ డ్యాన్స్ గ్రూప్ 'పుష్ప' పాటకు AGTలో పర్ఫామ్ చేసినట్లుగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఒక గ్లోబల్ ఫెనామినా. 'బి యూనిక్ క్రూ' AGT సీజన్ 20 వేదికపై పుష్ప పాటకు ప్రదర్శన ఇచ్చింది. స్పందన అద్భుతంగా ఉంది. జడ్జీలు దానిని 'సీజన్‌లోని ఉత్తమ ...