భారతదేశం, డిసెంబర్ 4 -- అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనకు నేటితో (డిసెంబర్ 4) సరిగ్గా ఏడాది. అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలయ్యాడు. రూ. 2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఏడాది గడిచినా తాము ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నామని శ్రీతేజ్ తండ్రి కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనిపై తాజాగా బన్నీ వాస్ స్పందించాడు.

ఈ ఆరోపణలపై 'హిందుస్థాన్ టైమ్స్' అల్లు అర్జున్ ప్రతినిధిని సంప్రదించగా, గురువారం (డిసెంబర్ 4) జరిగిన ఒక ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు మీడియాకు చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నామని తెలిపాడు. శ్రీతేజ్ కుటుంబం అభ్యర్థనను అల్లు అర్జున్ పట్టించుకోవడం లేదన్న వార్తలపై బన్నీ వాసు స్పందించ...