Hyderabad, జూలై 1 -- కన్నప్ప మూవీలో పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ కనిపించిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రాణిస్తుండగానే.. గతంలో కాజల్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలువురు సౌత్ స్టార్ హీరోల 'లుక్స్' గురించి రేటింగ్ ఇచ్చింది. ఆమె దృష్టిలో అందరిలోకెల్లా 'మోస్ట్ హ్యాండ్‌సమ్' ఎవరో తెలుసా?

రాపిడ్-ఫైర్ రౌండ్‌లో, కాజల్‌ను సౌత్ నటులను వారి లుక్స్ ఆధారంగా రేట్ చేయమని అడిగారు. అప్పుడు ఆమె అల్లు అర్జున్‌కు 6/10, ప్రభాస్‌కు 8/10, రామ్ చరణ్‌కు 7/10, జూనియర్ ఎన్టీఆర్‌కు 6/10, కల్యాణ్ రామ్‌కు 5/10, రామ్ పోతినేనికి 7/10 రేటింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో ప్రభాస్‌ను అందరిలోకెల్లా అత్యంత అందమైన హీరోగా ఆమె స్పష్టంగా చెప్పింది.

ఆమె ఇచ్చిన రేటింగ్‌లతో అ...