భారతదేశం, జనవరి 13 -- మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. సుమారు రెండేళ్ల నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన మార్కు బాక్సాఫీస్ పవర్‌తో అభిమానులను అలరిస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరాప్రసాద్ గారు' చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, 'వింటేజ్ చిరంజీవి'ని చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.

చిరంజీవి కెరీర్‌లోనే మన శంకర వరప్రసాద్ గారు రెండో అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తొలి రోజే భారత్‌లో రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

ఆదివారం (జనవరి 11) జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన రూ. 8.75 కోట్లను కలిపితే, దేశ...