భారతదేశం, జనవరి 5 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ సోమవారం (జనవరి 5) తన 40వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం (AA22 X A6) నుంచి అప్డేట్ లేదా ఫస్ట్ లుక్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. అయితే నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్', 'సన్ మ్యూజిక్' రిలీజ్ చేసిన పోస్టర్స్ చూసి ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. అసలు ఇవి అఫీషియల్ పోస్టర్లా లేక ఫ్యాన్ ఎడిట్సా అని తలలు పట్టుకుంటున్నారు.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందులోనూ దీపికా పుట్టినరోజు కావడంతో ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అంతా భావించారు. కానీ జరిగింది వేరు. సన్ నెట్‌వర్క్ రిలీజ్ చేసిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

దీపికా పదుకోన్ ఒక ఫ్లోవీ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సన...