భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఐఎండీ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానాంలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 'సెప్టెంబర్ 5 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.' అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది.

మంగళవారం దక్షిణ త...