Andhrapradesh, జూన్ 26 -- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీలో 4 రోజులపాటు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది.

రాష్ట్రంలోని పలుచోట్ల 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, ...