భారతదేశం, జనవరి 28 -- మరికొన్ని రోజుల్లో ఎక్కిడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? కొంతకాలం బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసకోవాలనుకంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఐఆర్‌సీటీసీ అందించే అమేజింగ్ టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకోండి. ఐఆర్‌సీటీసీ సూపర్ డూపర్ ప్యాకేజీలోని అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి అండమాన్‌కు టూర్ ఆపరేట్ చేస్తోంది. అమేజింగ్ అండమాన్ టూర్ పేరుతో మార్చి 30వ తేదీన అందుబాటులో ఉంది. ఇందులో అనేక ప్రాంతాలను చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు. ఆరు రోజులు, ఐదు రాత్రులు వెళ్లి రావొచ్చు. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం), హవ్‌లాక్, నెయిలీ చుట్టేసి రావొచ్చు.

ఉదయం 06:25కి హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం) విమానాశ్రయానికి ఉదయం 08:55కి చేరుకుంటారు. హోటల్‌కు చెక్ ఇన్ అవుతారు. భోజనం చేస్తారు. సెల్యులార్ జైల...