భారతదేశం, డిసెంబర్ 4 -- బాలీవుడ్ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితం గురించి, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు, బ్రేకప్ వంటి వ్యక్తిగత విషయాల్లో మగవారిని ఒకలా, ఆడవారిని మరోలా చూసే 'ద్వంద్వ ప్రమాణాలను/వైఖరిని' (Double Standards) ఆమె ఎండగట్టారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మలైకా అరోరా.. సమాజం తీరుపై తనదైన శైలిలో స్పందించారు.

సమాజంలో నెలకొన్న మూస ధోరణులపై మలైకా స్పందిస్తూ.. "మనం ఎంత ధైర్యంగా ఉన్నా, జనాలు మనల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఆగిపోవు. నా జీవితంలో నేను ఈ స్థాయికి రావడానికి కొంతమంది మగవారు (తండ్రి, మాజీ భర్త, స్నేహితులు వంటివారు) కూడా కారణమే, దాన్ని నేను కాదనను. కానీ, ప్రస్తుత రోజుల్లో ఒక మగవాడు విడాకులు తీసుకుని, తనకంటే సగం వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుం...