Hyderabad, జూన్ 29 -- బిగ్ బాస్ తెలుగు 7తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, కోర్ట్ మూవీలతో సూపర్ హిట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు శివాజీ. తాజాగా బిగ్ బాస్ శివాజీ, హీరో సుహాస్ ముఖ్య అతిథులుగా ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు.

సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ ఓటీటీ సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు. జూలై 3 నుంచి ఈటీవి విన్‌లో ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా తాజాగా జూన్ 28న ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఏఐఆర...