Hyderabad, ఆగస్టు 7 -- మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సౌత్ హీరోల గురించి చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఓ సీన్ చేయనందుకు ఓ హీరో తనను అందరి ముందే అవమానించేలా మాట్లాడాడని, ఆ మరుసటి రోజే క్షమాపణ చెప్పాడని కూడా ఆమె వెల్లడించింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటూ ఇప్పుడు ఫ్యాన్స్ ఆమెను అడుగుతున్నారు.

ఓ ఇంటర్వ్యూలో తమన్నా భాటియా మాట్లాడింది. తాను చాలా చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టానని, అలాంటప్పుడు చాలా మంది మన కాన్ఫిడెన్స్ దెబ్బ తీయాలని చూస్తారని ఆమె చెప్పింది. ఎందుకంటే ఆ వయసులో కొన్ని విషయాలు అర్థం కావు కదా అని తమన్నా తెలిపింది. తన కెరీర్లో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్నట్లు ఆమె వెల్లడించింది. నార్త్, సౌత్ హీరోల మధ్య తేడా ఏంటని అడిగినప్పుడు తమన్నా ఇలా స్పందించింది.

ఈ సందర్భంగా ఓ ఘటన గురించి ఆమె రివీల్ చేసింది. "ఎవరైనా మిమ్మల...