భారతదేశం, నవంబర్ 3 -- కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ అయిన ప్రకాష్ రాజ్ ఘాటు కామెంట్స్ చేశాడు. సోమవారం (నవంబర్ 3) సాయంత్రం 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించారు. ఈ జాబితాలో 'మంజుమ్మెల్ బాయ్స్', 'భ్రమయుగం' వంటి సినిమాలు పలు అవార్డులను గెలుచుకున్నాయి. ఈ ఏడాది అవార్డులకు జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహరించాడు. అవార్డుల ప్రకటన అనంతరం ప్రెస్ మీట్ లో అతడు నేషనల్ అవార్డులపై ఘాటు కామెంట్స్ చేశాడు.

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా తన అనుభవాన్ని, అలాగే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మమ్ముట్టిని పట్టించుకోకపోవడంపై ప్రకాష్ రాజ్‌ ప్రశ్నించాడు. దీనికి అతడు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

"జాతీయ చలనచిత్ర అవార్డులు రాజీ పడుతున్నాయని చెప్పడానికి నేను అస్సలు సందేహించను. కేరళ ...