Hyderabad, ఏప్రిల్ 27 -- కన్నడ బ్యూటిపుల్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ 1, 2 సినిమాలతో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఒకటిరెండు సినిమాల్లో నటించి అలరించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇవ్వనుంది శ్రీనిధి శెట్టి.

నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న హిట్ ది థర్ట్ కేస్ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో హిట్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా కేజీఎఫ్ 3లో నటించడం, రామాయణంలో సీత క్యారెక్టర్‌ను రెజెక్ట్ చేయడం వంటి ఇతర సినీ విశేషాలను పంచుకుంది శ్రీనిధి శెట్టి.

-నాని గారి సినిమాలన్నీ చూశాను. నేచురల్ పర్ఫార్మర్. ఆయన చాలా గ్...