Hyderabad, మే 13 -- నేటి బిజీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలను నిర్వర్తిస్తూ చాలా సార్లు మన శరీరం, మనస్సు రెండూ చాలా అలసిపోతాయి. కొన్నిసార్లు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలసట, నీరసం వేధిస్తాయి. ఇలాంటి సమయంలో పని మీద కూడా మనసు లగ్నం చేయలేము.

చాలా మంది టీ లేదా కాఫీ సాయంతో ఈ అలసట, నీరసాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యకరమైనది కాదు. మరేం చేయాలి అంటారా? అయితే ఇది మీ కోసమే. మీ అలసటను తక్షణమే తగ్గించి మిమ్మల్ని మళ్ళీ శక్తివంతం చేసేందుకు మీకు ఉపయోగపడే కొన్ని సులభమైన, సహజమైన 5 చిట్కాల గురించి తెలుసుకుందాం.

మన శరీరం అలసిపోయిందంటే మనస్సు కూడా మందగించడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు అలసటను తగ్గించుకోవడానికి గాఢంగా శ్వాస తీసుకోవడం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం నిటారుగా కూర్చుని, దాదా...