భారతదేశం, జనవరి 16 -- నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన మూవీ అనగనగా ఒక రాజు. ఈ సంక్రాంతికి భారీ కాంపిటీషన్ మధ్య వచ్చినా మంచి సక్సెస్ సాధించింది. దీంతో మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ.. ఆరేళ్ల కిందట వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత తనకు ఇదే బెస్ట్ సంక్రాంతి అని అనడం విశేషం.

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడు నిర్మించిన అనగనగా ఒక రాజు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. దీంతో ఆరేళ్ల తర్వాత తనకు ఇదే అత్యంత సంతృప్తికర సంక్రాంతి అని అతడు అన్నాడు. శుక్రవారం (జనవరి 16) మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

"లాస్ట్ ఇయర్ కూడా పెద్ద హిట్ కానీ అనుకున్నంత సాటిస్‌ఫ్యాక్షన్ లేదు. సినిమా హిట్ అయితే ఉండే 100 శాతం సంతృప్తి లేదు. ఈసారి మాత్రం 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో త...