భారతదేశం, జూన్ 20 -- జూన్​ 25న జరగనున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్​) కోసం ఎగ్జామ్​ సిటీ ఇంటిమేషన్​ స్లిప్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. ఆ రోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ugcnet.nta.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్​ సిటీ స్లిప్​ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్‌లు, పుట్టిన తేదీలను ఉపయోగించి యూజీసీ నెట్​ సిటీ ఇంటిమేషన్​ స్లిప్​ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అడ్మిట్ కార్డులకు ముందు పరీక్షా నగర సూచన స్లిప్‌లను ఎన్టీఏ విడుదల చేస్తుంది. దీని ద్వారా అభ్యర్థులకు వారి పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ పత్రాన్ని పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోవాలి.

అడ్మిట్ కార్డులో...