Andhrapradesh, సెప్టెంబర్ 14 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 48 గంటల్లో దక్షిణఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాకుండా దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది.

తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. తీరం వెంబడి 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఆదివారం(14-09-2025): ఇవాళ శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్...