భారతదేశం, డిసెంబర్ 8 -- మీ శరీరం ఒత్తిడికి గురవుతుందోందని చెప్పేందుకు ఒక సింపుల్​ సంకేతం ఉంది! అది.. రాత్రిపూట, ముఖ్యంగా 1 గంట లేదా 2 గంటల సమయంలో హఠాత్తుగా మెలకువ రావడం. ఈ విషయాన్ని అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజ్‌రాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. గుండె జబ్బులకు చికిత్స చేయడంలో డాక్టర్ భోజ్‌రాజ్‌కు 20 ఏళ్ల అనుభవం ఉంది.

డాక్టర్ భోజ్‌రాజ్ ప్రకారం.. ఉదయం వేళల్లో పీక్ స్థాయికి చేరాల్సిన కార్టిసాల్ హార్మోన్, అసాధారణంగా వేరే సమయాల్లో పెరగడం వల్ల ఇలా రాత్రిపూట మెలకువ వస్తుంది.

కార్టిసాల్ అనేది శరీరంలో ప్రధాన ఒత్తిడి హార్మోన్.

తాను పోస్ట్ చేసిన వీడియోలో, రాత్రిపూట హఠాత్తుగా మెలకువ రావడం అనేది ఒత్తిడికి సంబంధించిన కీలకమైన జీవసంబంధ సంకేతం అని ఆయన వివరించారు.

"చాలా మంది పట్టించుకోని, మీ శరీరం ఒత...