భారతదేశం, జనవరి 14 -- తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఐఏఎస్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ వార్త ఛానల్, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ కూడా ఏర్పాటైంది. తాజాగా ఈ కేసులో ఓ ఛానల్‌ ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.

జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూజే ఖండించింది. జర్నలిస్టులుగానీ, ఆ వార్త సంస్థ గానీ నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు అ...